బోయపాటి శ్రీను

Friday,November 20,2020 - 11:50 by Z_CLU

బోయపాటి శ్రీను ప్రముఖ దర్శకుడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘భద్ర’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తో ‘తులసి’ సినిమాను తెరకెక్కించాడు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాల తర్వాత అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ బెల్లం కొండ శ్రీనివాస్ తో ‘జయజనకి నాయక’ సినిమాలను రూపొందించాడు. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా తీసిన బోయపాటి, ప్రస్తుతం బాలయ్యతోనే హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

సంబంధిత వార్తలు