రవితేజ లిస్టులో ఆ దర్శకుడు ?

Monday,February 15,2021 - 05:54 by Z_CLU

‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ మీదున్న మాస్ మహారాజా రవితేజ  ప్రస్తుతం వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న రవితేజ  పూరి జగన్నాథ్, వక్కంతం వంశీతో  సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో డైరెక్టర్ పేరు కూడా చక్కర్లు కొడుతుంది. రవితేజ త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. బాలయ్య తో చేస్తున్న సినిమా తర్వాత బోయపాటి రవితేజతోనే సినిమా చేస్తాడని అంటున్నారు.

పదిహేనేళ్ళ క్రితం ‘భద్ర’ తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో  మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తనకి దర్శకుడిగా అవకాశమిచ్చిన రవితేజతో ఈసారి బోయపాటి ఎలాంటి సినిమా చేస్తాడు ? అసలు ఈ కాంబో ప్రచారం ఎంత వరకు నిజం ? అనేది తెలియాల్సి ఉంది.

Also Read కలకత్తాలో ‘శ్యామ్ సింగ రాయ్’