రామ్ చరణ్ సినిమాకు మరోసారి తమన్

Thursday,December 07,2017 - 12:22 by Z_CLU

గతంలో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాకు సంగీతం అందించాడు తమన్. ఆ పాటలు ఎంత హిట్ అయ్యారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మెగా మీటర్ అనే ఫాస్ట్ బీట్ అయితే ఇప్పటికీ యూత్ హాట్ ఫేవరెట్. అలాంటి సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ తర్వాత మరోసారి రామ్ చరణ్, తమన్ కలుస్తున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ మూవీకి సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు తమన్. చెర్రీ-తమన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండడంతో పాటు.. బోయపాటి సినిమాలకు కూడా సంగీతం అందించిన అనుభవం తమన్ కు ఉంది. అందుకే ఈ మూవీకి ఈజీగానే సెలక్ట్ అయిపోయాడు ఈ కంపోజర్.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే రంగస్థలం షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి సినిమా స్టార్ట్ అవుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అవుతాయి.