రామ్ చరణ్, బోయపాటి సినిమా ప్రారంభం

Friday,November 24,2017 - 11:38 by Z_CLU

రూమర్లకు చెక్ పడింది. మరో బ్రహ్మాండమైన కాంబినేషన్ ఫిక్స్ అయింది. మాస్ డైరక్టర్ బోయపాటి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్-4గా ఈ సినిమా రాబోతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు ఉదయం జరిగాయి.

బోయపాటి-చరణ్ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. ధృవ లాంటి క్లాస్ మూవీ, రంగస్థలం లాంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ మూవీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్. జనవరి నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది. వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేయబోతున్నారు.

బోయపాటి-చరణ్ ప్రాజెక్టుకు తమన్ సంగీతం అందిస్తాడు. హీరోయిన్లతో పాటు ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.