చిరు, బాలయ్య, మహేష్ తో సినిమాలు: బోయపాటి

Thursday,August 10,2017 - 04:32 by Z_CLU

జయజానకి నాయక సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ సినిమా తర్వాత ఈ మాస్ దర్శకుడు ఏ సినిమా చేయబోతున్నాడనే డౌట్ అందర్లో ఉంది. కొంతమంది చిరంజీవితో సినిమా చేస్తాడని, మరికొందరు బాలకృష్ణతో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్తాడని అన్నారు. ఫైనల్ గా తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు బోయపాటి.

“చిరంజీవికి కథ రెడీగా ఉంది. కాకపోతే ఎప్పుడు చేస్తామో తెలీదు. ప్రస్తుతానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. ఆ సినిమా అయిన తర్వాత చిరంజీవి ఏం చేస్తారో తెలీదు. కథ మాత్రం రెడీగా ఉంది. ఇక మహేష్ బాబు సినిమా విషయానికొస్తే చాలా కొత్త జానర్ లో ట్రై చేస్తున్నాం. కాకపోతే డేట్స్ ఎక్కువ కావాలి. మహేష్ కథ కూడా రెడీ. వచ్చే ఏడాది మే లేదా జూన్ లో బాలయ్య సినిమా మాత్రం కచ్చితంగా స్టార్ట్ చేస్తాం. ఇది ఎప్పుడో కమిట్ అయిన సినిమా”.

బాలయ్య, చిరంజీవి, మహేష్ తో సినిమాలు చేస్తానంటున్న బోయపాటి అఖిల్ మూవీపై కూడా స్పందించాడు. “అఖిల్ నాకు చాలా క్లోజ్. అతడి కోసం కూడా స్టోరీలైన్ రెడీగా ఉంది. కాకపోతే ఎప్పుడనేది తెలీదు. టైమ్ చూసి ఎనౌన్స్ చేస్తాం. ఆర్డర్ లో అఖిల్ సినిమా ఎప్పుడొస్తుందో చెప్పలేం. అఖిల్ ఆల్ రౌండర్. పైకి క్లాస్ గా కనిపిస్తాడు కానీ ఏదైనా చేయగలడు. అఖిల్ తో సినిమా చేస్తానని మాటిచ్చాను. ఎప్పుడనేది చెప్పలేం”.