Ram- Boyapati మాస్ కాంబో !

Saturday,April 03,2021 - 11:06 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ , ‘రెడ్’ సినిమాలతో కంప్లీట్ మాస్ హీరోగా మారిన హీరో రామ్ ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామితో  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మే నుండి మొదలు కానుంది. ఈ లోపు మరో మాస్ డైరెక్టర్ తో రామ్ తన నెక్స్ట్ సినిమాను ఫైనల్ చేసుకున్నాడట.

హీరోలను మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తూ యాక్షన్ డ్రామా సినిమాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం బాలయ్యతో ‘BB3’ సినిమా తీస్తున్న బోయపాటి ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా రామ్ తోనే అని తెలుస్తుంది. ఈ లోపు రామ్ లింగుస్వామి సినిమాను కంప్లీట్ చేస్తాడని అంటున్నారు.  త్వరలోనే ఈ కాంబో సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. మరి రామ్ తో బోయపాటి ఏ రేంజ్ యాక్షన్ సినిమా చేస్తాడో ? చూడాలి.