రామ్ చరణ్, బాలయ్య మధ్యలో బోయపాటి

Thursday,May 24,2018 - 12:16 by Z_CLU

ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు బోయపాటి. మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న రీసెంట్ గా బ్యాంకాక్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. చెర్రీ ని కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ మాసివ్ డైరెక్టర్ మరోవైపు బాలయ్య సినిమాను కూడా అదే రేంజ్ ఫోకస్ లో పెట్టుకున్నాడు.

ఆల్మోస్ట్ బాలయ్య సినిమా స్క్రిప్ట్ వర్క్ ని లాక్ చేసిన బోయపాటి రామ్ చరణ్ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వస్తాడు. అయితే ఈ సినిమా లాంచ్ ని మాత్రం బాలయ్య బర్త్ డే సందర్భంగా  జూన్ 10 న  గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడట.

 బాలయ్య బర్త్ డే ని ఈ సినిమా లాంచ్ కి పర్ఫెక్ట్ ముహూర్తంగా ఫిక్సయిన బోయపాటి, అదే రోజు సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.