వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్

Monday,December 24,2018 - 02:54 by Z_CLU

ఒక్కో సింగిల్ రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది ‘వినయ విధేయ రామ’ టీమ్. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన వీడియోస్ లో రామ్ చరణ్ గెస్చర్ ని అంతే గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇదే స్పీడ్ లో గ్రాండ్ గా  ఈ వీక్  లోనే  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 27న జరగనున్న ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు.

యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్, ఈ ఈవెంట్ తో మరింత హైప్ అందుకోవడం గ్యారంటీ. బోయపాటి మార్క్ తో తెరకెక్కుతుంది వినయ విధేయ రామ. దాంతో పాటు రామ్ చరణ్ మార్క్ డ్యాన్స్ నంబర్ ఉండేలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

రీసెంట్ గా షూట్ జరుపుకున్న ఒక సాంగ్ కోసం ఏకంగా 800 మంది డ్యాన్సర్స్ తో షూట్ చేసిందట వినయ విధేయ రామ టీమ్. దీంతో పాటు స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ చెర్రీ కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. D.V.V. దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్. D.S.P. మ్యూజిక్ కంపోజర్.