‘VVR’ లో ఆ సీక్వెన్స్ ఎందుకంత స్పెషల్...?

Wednesday,December 26,2018 - 03:22 by Z_CLU

మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ కి ఉందనగానే ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో, ఆల్మోస్ట్ ఆ అంచనాలు రీచ్ అవ్వడానికి ప్రయత్నించాడు దర్శకుడు బోయపాటి. అందుకే ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడీ వరసలో సినిమాలో కీలక సందర్భంలో ఉండబోయే ఫైట్ సీక్వెన్స్ కూడా చేరింది.

సినిమాలో ఒక సందర్భంలో ఉండబోయే ఒక ఫైట్ సీక్వెన్స్ ని అజర్ బైజాన్ లో తెరకెక్కించారు మేకర్స్. సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ చాలా ప్రత్యేకం కానుంది. మాసివ్ ఎఫెక్ట్ లో తెరకెక్కిన ఈ ఫైట్ సీక్వెన్సెస్ లో, మ్యాగ్జిమం స్టంట్స్ గుర్రాలపై జరిగాయట. అయితే ఎపిసోడ్ లో రామ్ చరణ్ వాడిన గుర్రం చాలా స్పెషల్ అని తెలుస్తుంది. సినిమాలో రామ్ చరణ్ వాడిన గుర్రాన్ని, నెదర్లాండ్ నుండి తెప్పించి మరీ షూటింగ్ జరిపారట మేకర్స్.

ఈ విషయం రివీల్ అయినప్పటి నుండి ఆడియెన్స్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ చుట్టూ మరింత క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది. బోయపాటి చెర్రీ స్టామినాని పర్ఫెక్ట్ గా వాడుకుంటాడు అనే టాక్, సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. D.V.V. దానయ్య ప్రొడ్యూసర్.