#BoyapatiRapo హీరోయిన్ ఫిక్సయినట్టేనా ?

Saturday,February 26,2022 - 06:02 by Z_CLU

Parinithi Chopra in talks for #BoyapatiRapo ?

కొన్ని కాంబినేషన్ సినిమాలు ఎనౌన్స్ మెంట్ నుండే అందరిలో ఆసక్తి నెలకొలుపుతుంటాయి. ఆ లిస్టులో తాజాగా చేరిన కాంబో బోయపాటి -రాపో. ‘అఖండ’ విజయం తర్వాత తన నెక్స్ట్ సినిమాను రామ్ హీరోగా చేస్తున్నాడు బోయపాటి. ఇస్మార్ట్ శంకర్ తో తనలోని మాస్ ని ఆడియన్స్ కి పరిచయం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ కోసం ఓ మాస్ కథ రెడీ చేసి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు బోయపాటి.

ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు బోయపాటి శ్రీను. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాని అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. ఆమెకి మేకర్స్ కి మధ్య టాక్స్ నడుస్తున్నాయని సమాచారం. అయితే పరిణితిని  అప్రోచ్ అవ్వడానికి రీజన్… బాలీవుడ్ మార్కెట్. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నారు. ఆలిస్టులో పరిణితి ముందుంది.

 స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు బోయపాటి. ప్రస్తుతం రామ్ లింగుస్వామితో రామ్ ‘ది వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యే లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ కి అంతా సిద్దం చేయనున్నాడు బోయపాటి. ఈ కాంబినేషన్ లో మొదటి సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics