Balakrishna - హీరోయిన్లతో షూటింగ్

Friday,November 20,2020 - 12:06 by Z_CLU

బాలయ్య-బోయపాటి సినిమా కొత్త షెడ్యూల్ ఇది వరకే మొదలైంది. ఇవాళ్టి నుంచి మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ స్పెషాలిటీ ఏంటంటే.. హీరోయిన్లు సెట్స్ పైకొచ్చారు.

ఈ సినిమాలో పూర్ణ, సాయేషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ ఈరోజు సెట్స్ పైకి వచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో బాలయ్య-హీరోయిన్లపై కీలక సన్నివేశాలు పిక్చరైజ్ చేస్తున్నారు

ఈ సినిమాలో Poorna ను హీరోయిన్ గా చాన్నాళ్ల కిందటే తీసుకున్నారు. తాజాగా Sayyesha ను ఫిక్స్ చేశారు. మలయాళీ నటి ప్రయాగ మార్టిన్ స్థానంలో సాయేషా వచ్చింది.

BalakrishnaBoyapati కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ (#BB3) ఇది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ నిర్మాత.

Also Check – బాలయ్య సినిమాలో లేడీ విలన్?