ఈనెల 26న చరణ్-బోయపాటి సినిమా?

Wednesday,November 22,2017 - 05:05 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో మరో 4 రోజుల్లో రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కాబోతోంది. అవును.. ఈనెల 26న చెర్రీ-బోయపాటి సినిమా లాంచ్ అవుతుందంటూ రూమర్స్ వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారట.

నిజానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ భారీ ప్రాజెక్టు సైరా కారణంగా బోయపాటి-చిరు సినిమా వెనక్కి వెళ్లింది. సో.. ఈ గ్యాప్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా సెట్ అయింది.

బోయపాటి-చరణ్ సినిమాపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. అంతకంటే ముందు కొరటాల శివ సినిమాను మాత్రం అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు చరణ్. కానీ మహేష్ తో చేస్తున్న మూవీ కంప్లీట్ అయ్యేంతవరకు చెర్రీతో కలిసి సెట్స్ పైకి వెళ్లలేడు కొరటాల. అందుకే ఈ గ్యాప్ లో బోయపాటితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట చెర్రీ.