జయ జానకి నాయక ఆడియో రిలీజ్ డేట్
Thursday,July 27,2017 - 01:03 by Z_CLU
బోయపాటి శ్రీను ‘జయ జానకి నాయక’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయింది. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తునన్ ఈ సినిమా ఇప్పటికే రీసెంట్ గా రిలీజైన టీజర్స్ తో సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేసింది. అటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఇటు అల్టిమేట్ యాక్షన్ సీక్వెన్సెస్ తో తెరకేకిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ మధ్య గ్రాండ్ గా జూలై 31 న ఆడియో రిలీజ్ జరుపుకోనుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.
ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరిసా ఇంటరెస్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని ఆగష్టు 11 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.