ఇంతకీ బోయపాటి హీరో ఎవరు..?

Friday,July 19,2019 - 12:03 by Z_CLU

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా కమిట్ అయ్యాడు బోయపాటి. అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు రాబోతుంది..? అసలిప్పుడు రేజ్ అయ్యే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది కాదు… బ్యానర్ వరకు ఓకె… కానీ అసలు బోయపాటి సినిమా హీరో ఎవరు..? రీసేంట్ గా మెగా పవర్ స్టార్ తో ‘వినయ విధేయ రామ’ చేసిన బోయపాటి.. ఈసారి ఏ హీరోతో సెట్స్ పైకి రాబోతున్నాడు…?

మెగా బ్యానర్ కాబట్టి హీరో కూడా మెగా కాంపౌండ్ నుండే ఉంటాడా..? గతంలో బన్నితో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి, మరోసారి వీళ్ళిద్దరు కలిసి సెట్స్ పైకి రానున్నారా…? ఇప్పట్లో బన్ని డేట్స్ దొరకాలంటే బోయపాటికి కొంచెం కష్టమే… మరి బోయపాటి మైండ్ లో ఉన్న హీరో ఎవరు..?

కార్తేకేయ సినిమా కూడా గీతా ఆర్ట్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. అంటే ఈ లెక్కన బోయపాటి, కార్తికేయ కాంబినేషన్ లో సినిమానా..? ఇదే కన్ఫమ్ అనుకోవచ్చా…? అలాంటప్పుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం ఎందుకు కాకూడదు.

సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండబోతుంది. అంటే బోయపాటి సినిమాలో హీరోగా కార్తికేయ కి ఎన్ని చాన్సెస్ ఉన్నాయో, సాయి ధరమ్ తేజ్ కి కూడా అన్నే ఉన్నాయి. కానీ అల్టిమేట్ డెసిషన్ మాత్రం ఇక్కడ నిర్మాతదే. కాబట్టి అప్పుడే.. పెద్దగా ఫిక్సవ్వడానికి లేదు.. అఫీషియల్ గా అనౌన్స్ చేయడం తప్పా…