మరోసారి రామ్ చరణ్ తో రకుల్ ప్రీత్ సింగ్

Wednesday,June 27,2018 - 01:33 by Z_CLU

ధృవ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మరోసారి చెర్రీతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చెర్రీతో స్టెప్స్ వేయనుందట రకుల్.

ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా బోయపాటి డైరెక్షన్ లో ‘జయ జానకి నాయకా’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పుడు తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనుంది.

 

 

సినిమాలోని ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఉండబోయే ఈ సాంగ్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట బోయపాటి. మాసివ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు రకుల్ స్పెషల్ సాంగ్ అనగానే న్యాచురల్ గానే ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.