బాలయ్య -బోయపాటి సినిమా లాంచ్ అప్పుడే ...

Sunday,January 27,2019 - 02:17 by Z_CLU

బాలయ్య -బోయపాటి కాంబో సినిమాకు అంతా రెడీ అవుతోంది. ఇటివలే అనౌన్స్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి లో గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చ్ నుండి పట్టాలెక్కనుంది.

NBK ఫిలిమ్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డిటైల్స్ తెలియజేయనున్నారు మేకర్స్.