బాలయ్య-బోయపాటి సినిమా ముహూర్తం ఫిక్స్?

Thursday,March 07,2019 - 12:30 by Z_CLU

లెక్కప్రకారం ఈపాటికి వీళ్లిద్దరి క్రేజీ కాంబోలో సినిమా స్టార్ట్ అవ్వాలి. కానీ ఇప్పటివరకు అది సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడీ కాంబినేషన్ పై మరో బజ్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 28న బాలయ్య-బోయపాటి కాంబోలో కొత్త సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. జస్ట్ సినిమాను మాత్రమే లాంఛ్ చేస్తారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఎన్నికల తర్వాత పెట్టుకుంటారట. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో బాలయ్య కీలకంగా వ్యవహరించబోతున్నారట. అందుకే పూర్తిగా ఎలక్షన్లపై దృష్టిపెట్టి, ఆ తర్వాత బోయపాటి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనేది ప్లాన్.

ఎన్టీఆర్ బయోపిక్ తో బాలయ్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. బోయపాటి సినిమాను కూడా తన సొంత బ్యానర్ పై ఎన్బీకే ఫిలిమ్స్ పై నిర్మించబోతున్నాడు బాలయ్య. లాంఛింగ్ రోజున ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి. గతంలో బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది.