వినయ విధేయ రామ ట్రయిలర్ రివ్యూ

Friday,December 28,2018 - 08:36 by Z_CLU

బోయపాటి శ్రీను సినిమాల్లో సాఫ్ట్ నెస్ అనేది పైపైన షుగర్ కోటింగ్ లా మాత్రమే కనిపిస్తుంది. లోపల మాస్ అలానే ఉంటుంది. వినయ విధేయ రామ ట్రయిలర్ ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. స్టార్టింగ్ లో ఫ్యామిలీ సాంగ్ రిలీజ్ చేసినా, ట్రయిలర్ లో తన మాస్ యాంగిల్ ను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేశాడు బోయపాటి.

వినయ విధేయ రామ ట్రయిలర్ అదిరిపోయింది. ఈమధ్యకాలంలో చరణ్ ను ఇంత మాస్ అవతార్ లో ఆడియన్స్ చూడలేదు. బోయపాటి మార్క్ ఫైట్స్, అతడి మార్క్ డైలాగ్స్ ను చరణ్ చెబుతుంటే ట్రయిలర్ కే ఓ కొత్త లుక్ వచ్చింది. తన ఫ్యామిలీని కాపాడుకునే ప్రొటెక్టర్ గా చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

సినిమాలో చరణ్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్లంతా ఒకప్పుడు స్టార్స్. అలాంటి స్టార్స్ కు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు బోయపాటి. ట్రయిలర్ లో వాళ్లకు కూడా చోటిచ్చాడు. ట్రయిలర్ లో డ్యూయట్స్ కు అస్సలు చోటివ్వలేదు దర్శకుడు. తను ఏం చెప్పాలనుకున్నాడో, సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటో దాన్నే చూపించాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది వినయ విధేయ రామ సినిమా. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.