చరణ్-బోయపాటి సినిమా ప్రారంభం

Friday,January 19,2018 - 11:23 by Z_CLU

బోయపాటి డైరక్షన్ లో రామ్ చరణ్ చేయాల్సిన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. మొదట సెంటిమెంట్ ప్రకారం.. స్టార్ట్-కెెమెరా-యాక్షన్ అనే సీన్ చిత్రీకరించారు. తర్వాత యూనిట్ అంతా రెగ్యులర్ షూటింగ్ కోసం రామోజీ ఫిలింసిటీకి షిఫ్ట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన కైరా అద్వానీ కూడా షూటింగ్ కు హాజరైంది.

చరణ్-బోయపాటి సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తాడు. బోయపాటి మార్క్ తో పక్కా యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా.. దసరా కానుకగా రాబోతోంది ఈ సినిమా.

అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో చరణ్ పాల్గొనడం లేదు. రంగస్థలం సినిమాకు సంబంధించి 2 పాటలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఇలా కనిపించి, రంగస్థలం షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లిపోయాడు చరణ్.