మెగా ఆఫర్ అందుకున్న బోయపాటి..?

Sunday,July 21,2019 - 12:20 by Z_CLU

ఇటివలే బోయపాటితో కలిసి సినిమా చేయబోతున్నా అంటూ ఓ ఈవెంట్ లో అనౌన్స్ చేసాడు అల్లు అరవింద్. ఆ అనౌన్స్ మెంట్ తో ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ సినిమాలో హీరో ఎవరా..? అనే ప్రశ్న ఆడియన్స్ లో మొదలైంది. ఇప్పుడా ప్రశ్నకి కొంత వరకూ క్లారిటీ వచ్చేసింది. బోయపాటి డైరెక్షన్ లో చేయబోయే హీరో మెగా స్టార్ అట. చిరు కోసం ఓ  మాస్ సబ్జెక్ట్ రెడీ చేసాడట బోయపాటి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారట.

అంతే కాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హీరో కార్తికేయ కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతానికి చిరు కొరటాలతో పాటు త్రివిక్రమ్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. మరి ఆ సినిమాలు పూర్తయ్యాకే బోయపాటికి ఛాన్స్ ఇస్తాడా..? లేదా రెండు సినిమాల గ్యాప్ లో ఏమైనా ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడా..? చూడాలి.