బాలయ్య బర్త్ డే గిఫ్ట్ రెడీ

Friday,March 16,2018 - 05:17 by Z_CLU

నందమూరి నటసింహం బాలయ్య పుట్టినరోజుకు ఇంకా చాలా టైం ఉంది. అయితే ఆ పుట్టినరోజు గిఫ్ట్ ఏంటనేది ఇప్పటికే ఫిక్స్ అయింది. అవును.. పుట్టినరోజు సందర్భంగా సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ కలవబోతోంది. బోయపాటి డైరక్షన్ లో బాలయ్య సినిమా రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలకృష్ణ పుట్టినరోజు నాడు (జూన్ 10) ఈ

సినిమా లాంచ్ అవుతుంది.

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టరే. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు చరిత్ర సృష్టించాయి. లెజెండ్ తర్వాత వీలైనంత త్వరగా ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ, వందో సినిమా నుంచి ట్రాక్ మార్చిన బాలయ్య, బోయపాటికి ఛాన్స్ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ కాంబో మరోసారి తెరపైకి రాబోతోంది.

 

తన ఫేవరెట్ హీరో బాలయ్య కోసం కథ ఎప్పుడో సిద్ధమైందని బోయపాటి చాన్నాళ్ల కిందటే ప్రకటించాడు. సింహా, లెజెండ్ తరహాలోనే రాబోయే సినిమా కూడా హై-లెవెల్లో ఉంటుందని స్పష్టంచేశాడు. ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని టాక్.