లైన్ క్లియర్ చేసుకున్న జయ జానకి నాయక

Thursday,August 03,2017 - 05:04 by Z_CLU

బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ ఆగష్టు 11 న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ లోపు సెన్సార్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ U/A సర్టిఫికెట్ పొందింది. అల్టిమేట్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

జూలై 31 న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన ఇంటరెస్టింగ్ టీజర్స్, ట్రేలర్ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ చేసేస్తున్నాయి. ఈ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత.