దసరాకి రామ్ చరణ్ నుండి మెస్మరైజింగ్ గిఫ్ట్

Monday,September 24,2018 - 04:45 by Z_CLU

అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది రామ్ చరణ్ కొత్త సినిమా. అయితే ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్, ఈ దసరా సంబరాల్లో మరింత జోష్ నింపనుంది. పండగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్.

మాసివ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో అంతే ఈజీగా సింక్ అయ్యేలా ఇమోషన్ ఆడ్ చేయడం బోయపాటి స్టైల్. చెర్రీని మాస్ హీరోగా చూడటం ఫ్యాన్స్ కి కొత్త కాదు కానీ, బోయపాటి మార్క్ హీరోలా చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా కావడంతో  ఈ  సినిమా చుట్టూ భారీ స్థాయిలో క్యూరియాసిటీ క్రియేట్ ఉంది.

ఈ రోజే యాక్షన్  కొరియోగ్రాఫర్  కణల్ కన్నన్ అధ్వర్యంలో అజర్ బైజాన్ లో భారీ ఫైట్ సీక్వెన్సెస్ కంప్లీట్ చేసుకున్న టీమ్, త్వరలో హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ చేయనుంది.

ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ, స్నేహ, ప్రశాంత్ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని D.V.V. దానయ్య నిర్మిస్తున్నాడు.