రామ్ చరణ్ , బోయపాటి మూవీ డీటెయిల్స్

Sunday,December 31,2017 - 01:30 by Z_CLU

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ ‘రంగస్థలం’ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే బోయపాటి తో చేయబోయే సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఇప్పటికే రంగస్థలం సినిమాకు సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసిన చరణ్ జనవరి 19 నుంచి బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాను స్టార్ట్ చేయనున్నాడని సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్నఈ సినిమాకు సంబంధించి నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు.