బాలయ్య తర్వాత ఆ బ్యానర్ లో బోయపాటి

Sunday,December 16,2018 - 12:58 by Z_CLU

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కిస్తున్న బోయపాటి నెక్స్ట్ బాలయ్య ని డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి గీతా ఆర్ట్స్ బ్యానర్  ఓ సినిమా చేస్తాడని సమాచారం.

సరైనోడు సక్సెస్ తర్వాత అల్లు అరవింద్ దగ్గర మరో సినిమాకు అడ్వాన్స్ తీసుకున్న బోయపాటి బాలయ్య తర్వాత ఆ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో సినిమా అయితే కన్ఫర్మ్ కానీ హీరో ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అన్ని కుదిరితే గీతా ఆర్ట్స్ లో బోయపాటి మెగా స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది.