రామ్ చరణ్ తో చిరు డైరెక్టర్ ?

Sunday,September 03,2017 - 12:06 by Z_CLU

మెగా స్టార్ చిరు ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి కథతో హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత చిరు బోయపాటితో సినిమా చేస్తాడనే వార్త తెలిసిందే. అయితే ప్రస్తుతం బోయపాటి చిరు కంటే ముందే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది..

ఇప్పటికే చిరు కోసం ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను రెడీ చేసిన బోయపాటి శ్రీను లేటెస్ట్ గా చరణ్ కోసం కోసం మరో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని చిరు ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమా పూర్తయ్యే లోపే ఈ కాంబినేషన్ లో సినిమా రానుందని, చరణ్- కొరటాల సినిమా తో పాటే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ వార్త కనుక నిజమైతే అల్లు అర్జున్ కి ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటి  చరణ్ కి కూడా ఓ బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి .