రేపే ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Wednesday,December 26,2018 - 12:51 by Z_CLU

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రిపరేషన్స్ బిగిన్ అయ్యాయి. రేపే గ్రాండ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి తో పాటు, KTR చీఫ్ గెస్ట్ గా రానున్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడ, పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఫ్యాన్స్ లో ఈ సినిమా రిలీజ్ పై ఏ రేంజ్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయి ఉందో, అదే స్థాయి ఇంట్రెస్ట్ ఈ ఈవెంట్ విషయంలోనూ ఉంది.

ఇదే ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. రేపు రాత్రి 9 గంటల నుండి యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది వినయ విధేయ రామ ట్రైలర్.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన 2 సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దానికి తోడు సినిమాలోని  ఒక సాంగ్ లో ఏకంగా 800 మది డ్యాన్సర్ తో షూట్ చేశారనే అప్డేట్, మెగా ఫ్యాన్స్ కి మరింత ఎనర్జీనిస్తుంది. రామ్ చరణ్ ఇమోషనల్ మాస్ అవతార్ తో పాటు, ఫాస్ట్ బీట్ డ్యాన్స్ నంబర్స్ తో ‘వినయ విధేయ రామ’ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.

రేపు జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేయనున్నారు మేకర్స్. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘వినయ విధేయ రామ’. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజర్. D.V.V. దానయ్య ప్రొడ్యూసర్.