3 కోట్ల బడ్జెట్ తో బీచ్ సాంగ్

Thursday,July 20,2017 - 05:26 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ‘జయ జానకి నాయక’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.సాయి శ్రీనివాస్ బెల్లంకొండ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. అటు యాక్షన్ ఎలిమెంట్స్ లోను ఇటు మాస్ ఎలిమెంట్స్ లోను ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ఫిలిం మేకర్స్ ఈ సినిమాలో సందర్భానుసారంగా ఉండే బీచ్ సాంగ్ కోసం 3 కోట్లతో సెట్ నిర్మించింది.

500 మంది ఇండియన్, ఫారిన్ డ్యాన్సర్లతో తెరకెక్కించబోయే ఈ సాంగ్ ని, బెల్లంకొండ శ్రీనివాస్, ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కించనున్నారు. ‘డిస్కో బాబు డిస్కో’ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ని ఎట్రాక్ట్ చేయడం గ్యారంటీ అంటుంది సినిమా యూనిట్.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్, గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలబడిపోయే స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆగష్టు 11 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.