

Tuesday,March 28,2023 - 10:56 by Z_CLU
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. #BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది. మాస్ తో పాటు ఫ్యామిలీస్ ని మెప్పించే సినిమాకి ఇది సరైన తేదీ. దసరా సెలవులు సినిమాకి కలిసిరాబోతున్నాయి.
అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రామ్ తన చేతితో గంగిరెద్దు (ఎద్దు)ని లాగుతూ పోస్టర్ లో రగ్డ్, మాస్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ లో రామ్ వైల్డ్ నెస్ గా కనిపిస్తున్నాడు. బోయపాటి శ్రీను రామ్ ని సరికొత్త మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడని అర్థమవుతుంది.
మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు.ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజుఎడిటింగ్ అందిస్తుండగా, సంతోష్ డిటాకే కెమరామెన్ గా పని చేస్తున్నారు. #BoyapatiRAPO హిందీ, అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల అవుతుంది.
Tuesday,May 02,2023 04:46 by Z_CLU
Monday,May 01,2023 06:34 by Z_CLU
Wednesday,April 19,2023 04:17 by Z_CLU
Wednesday,April 05,2023 02:35 by Z_CLU