రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' టీజర్ రిలీజ్

Friday,November 09,2018 - 12:01 by Z_CLU

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ టీజర్ రిలీజయింది. 0: 48 సెకన్ల పాటు ఉన్న ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ‘పందెం పరశురాం అయితే ఏంట్రా… ఇక్కడ రామ్.. రామ్ కొ..ణి..దె..ల…’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తుంది.

మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్నేహ కీ రోల్ లో కనిపించనుంది. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ రామ్ చరణ్ కి అన్నయ్యగా నటిస్తున్నారు.  D.V.V. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. బోయపాటి శ్రీను ఈ సినిమాకి డైరెక్టర్.