Balayya-Boyapati - హీరోయిన్ ఫిక్స్

Saturday,October 17,2020 - 12:19 by Z_CLU

హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే సెట్స్ పైకి వచ్చింది బాలయ్య-బోయపాటి సినిమా. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత లాక్ డౌన్ వల్ల సినిమాను పక్కనపెట్టారు. ఈ 6 నెలల గ్యాప్ లో హీరోయిన్ ను ఫైనలైజ్ చేసే పని పెట్టుకున్నాడు బోయపాటి. ఇందులో భాగంగా ప్రయాగ మార్టిన్ అనే మలయాళీ ముద్దుగుమ్మను సెలక్ట్ చేసినట్టు టాక్.

మల్లూవుడ్ కు చెందిన ప్రయాగ మార్టిన్ స్టిల్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని మేకర్స్ మాత్రం ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ చేయలేదు.

మోనార్క్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే నెల నుంచి సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు Boyapati. బాలయ్యతో సంబంధం లేని సీన్స్ ను షూట్ చేయాలనుకుంటున్నాడు.

సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత హీరోయిన్ పై ఓ క్లారిటీ రాబోతోంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read – బాలయ్య-అనీల్ రావిపూడి మూవీ