స్టూడియో రౌండప్

Wednesday,April 04,2018 - 10:18 by Z_CLU

రామ్ చరణ్ – బోయపాటి 

ప్రస్తుతం ‘రంగస్థలం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ ఏప్రిల్ 10 నుండి పవర్ ప్యాక్డ్ యాక్షన్ మోడ్ లోకి రానున్నాడు. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన బోయపాటి, ఈ ఫస్ట్ షెడ్యూల్ లో చెర్రీ కాంబినేషన్ లో ఉండబోయే కీలక సన్నివేశాలను ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

 

నా పేరు సూర్య 

మే 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ‘నా పేరు సూర్య’. టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ సినిమా జస్ట్ 2 సాంగ్స్ తప్ప ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

శర్వానంద్ – సుధీర్ వర్మ 

ఏప్రిల్ 5 నుండి సెట్స్ పైకి రానుంది శర్వానంద్ – సుధీర్ వర్మ సినిమా. హైదరాబాద్ లో 2 వారాల పాటు రెగ్యులర్ జరుపుకోనుంది సినిమా యూనిట్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

శ్రీనివాస కళ్యాణం 

నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ఇటివలే మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది. అమలాపురం సమీపంలో  ఓ షెడ్యుల్ ఫినిష్ చేసిన యూనిట్ రెండో షెడ్యుల్ రెడీ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 17 నుండి ఛండీగడ్ లో షెడ్యుల్ జరగనుంది. ఈ షెడ్యుల్ లో నితిన్ , రాశి ఖన్నా లపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నందిత శ్వేతా కీ రోల్ ప్లే చేస్తుంది. మిక్కి జే. మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

హలో గురు ప్రేమకోసమే 

రామ్ -అనుపమ కాంబినేషన్ లో త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యుల్ జరుపుకుంటుంది. ఈ షెడ్యుల్ లో రామ్, అనుపమ ప్రకాష్ రాజ్, అమల పై సీన్స్ షూట్ చేస్తున్నారు యూనిట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ కథా -మాటలు- స్క్రీన్ ప్లే అందిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.