నవంబర్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్న RC12

Wednesday,October 31,2018 - 06:32 by Z_CLU

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న రామ్ చరణ్ కొత్త సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. పక్కా ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, నవంబర్ 10 కల్లా ఆల్మోస్ట్ టాకీపార్ట్ ని కంప్లీట్ చేసుకోనుంది. ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా నవంబర్ లోనే తక్కిన 2 సాంగ్స్ ని కూడా కంప్లీట్ చేసి, అదే స్పీడ్  లో  పోస్ట్ ప్రొడక్షన్ పై  ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు ఫిల్మ్ మేకర్స్.

నవంబర్ 9 నుండి డబ్బింగ్ పనులు బిగిన్ చేయనున్న సినిమా యూనిట్, త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, వివేక్ ఒబెరాయ్  లతో  పాటు  స్నేహ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. D.V.V. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి D.S.P. మ్యూజిక్ కంపోజర్.