బోయపాటి మారిపోయాడా?

Wednesday,July 12,2017 - 04:30 by Z_CLU

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన రూట్ మార్చే పనిలో పడ్డాడా..? అనే ప్రశ్న టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి రీజన్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘జయ జానకి నాయక’ టీజర్. బెల్లంకొండ శ్రీనివాస్ – రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ లో బోయపాటి మార్క్ యాక్షన్ కనిపించకపోవడంతో అసలు బోయపాటి ఈ సినిమాను ఏ జానర్ లో తెరకెక్కించాడా..అనే చర్చ నడుస్తుంది..

బోయపాటి ఇప్పటివరకూ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్స్ కావడంతో బెల్లంకొండ శ్రీనుతో కూడా ఓ పవర్ ఫుల్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కిస్తాడనుకున్నారంతా.. అయితే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ అంచనాలను తారుమారు చేశాయి. లేటెస్ట్ గా టీజర్ లో అయినా బోయపాటి యాక్షన్ మార్క్ ఉందనుకుంటే అందులో కూడా క్లాసీ టచ్ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న బోయపాటి ఈ సినిమాలో తన స్టైల్ యాక్షన్ పార్ట్ ను కాస్త తగ్గించి ఎమోషన్, లవ్ ను ఎక్కువగా కారీ చేయాలనీ భావిస్తున్నాడట. జయజానకి నాయక సినిమాతో కొత్త బోయపాటిని చూస్తారని ఇన్ సైడ్ టాక్.