మేకోవర్ కంప్లీట్ - స్ట్రేట్ గా సెట్స్ పైకి రామ్ చరణ్

Tuesday,April 17,2018 - 03:24 by Z_CLU

ఇప్పటికే 2 షెడ్యూల్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బోయపాటి చెర్రీ సినిమా. అయితే ఈ సినిమాలో డిఫెరెంట్ లుక్ లో మెస్మరైజ్ చేయనున్నాడు రామ్ చరణ్. ‘రంగస్థలం’ తరవాత ఇమ్మీడియట్ గా ఈ సినిమా మేకోవర్ కోసం ప్రాక్టీస్ బిగిన్ చేసిన చెర్రీ, ఈ నెల 21 నుండి బిగిన్ కానున్న 3 వ షెడ్యూల్ లో ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడు.

ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్న మూవీ మేకర్స్, ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించి అరేంజ్ మెంట్ ప్రాసెస్ లో ఉన్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ నటిస్తుంది.

 

బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రశాంత్, స్నేహ లతో పాటు రమ్యకృష్ణ మరో క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి D.V.V. దానయ్య ప్రొడ్యూసర్.