వినయ విధేయ రామ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Friday,January 18,2019 - 04:35 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా మరోసారి ఎలివేట్ అయింది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ వినయ విధేయ రామ రికార్డు వసూళ్లు సాధించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విడుదలైన వారం రోజులకే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల రూపాయల షేర్ సాధించి గ్రేట్ అనిపించుకుంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమా వసూళ్లు 56 కోట్ల రూపాయల పైనే ఉన్నాయి.

ఈ 7 రోజుల రన్ లో సీడెడ్ లో దుమ్ముదులిపింది వినయ విధేయ రామ సినిమా. నైజాంలో ఇంకా బ్రేక్-ఈవెన్ అవ్వకపోయినా కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉన్నాయి. అటు గంటూరులో కూడా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది ఈ సినిమా.

ఏపీ, నైజాం 7 రోజుల షేర్

నైజాం – రూ. 12.01 కోట్లు

సీడెడ్ – రూ. 10.92 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 6.67 కోట్లు

ఈస్ట్ – రూ. 4.58 కోట్లు

వెస్ట్ – రూ. 3.77 కోట్లు

గుంటూరు – రూ. 6.04 కోట్లు

కృష్ణా – రూ. 3.39 కోట్లు

నెల్లూరు – రూ. 2.62 కోట్లు