సోషల్ మీడియాలో 'జయజానకి' రికార్డ్స్

Thursday,July 13,2017 - 12:43 by Z_CLU

బోయపాటి శ్రీను లేటెస్ట్ మూవీ జయజానకి నాయక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా టీజర్ కు 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఫేస్ బుక్, యూట్యూబ్ కౌంట్ కలిపి ఈ లెక్క చెప్పారు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఓ సినిమాకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం. బోయపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా కావడం, టీజర్ కూల్ గా ఉందని టాక్ రావడంతో వ్యూస్ భారీగా పెరిగాయి.

తన స్టయిల్ కు భిన్నంగా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కూల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జయజానకి నాయక వస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్ నుంచి తాజాగా విడుదలైన టీజర్ వరకు అంతా కూల్ గా ఉంది. వీటితో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ ఫొటో కూడా ఒకటి విడుదల చేశారు. అంటే సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అర్థంచేసుకోవచ్చు.

జయజానకి నాయక లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి, ఆగస్ట్ 11న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.