ఫ్రైడే రిలీజ్

Wednesday,August 09,2017 - 08:04 by Z_CLU

సరికొత్త సినిమాలతో రెడీ అయిపోయింది ఈ వీకెండ్ బాక్సాఫీస్. గతవారం రోజులుగా ఇంటరెస్టింగ్ ప్రమోషన్స్ తో హల్ చల్ చేస్తున్న సినిమాలు ఫ్రైడే బాక్సాఫీస్ వార్ రెడీ అయిపోయాయి. ఆ సినిమాలివే…

 

లై : ఫస్ట్ లుక్ రిలీజయినప్పటి నుండే ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తూ, హై ఎండ్ డిమాండ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషనల్ మూవీ ‘లై’. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ నటించింది.

జయ జానకి నాయక : బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జయ జానకి నాయక’. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో పవర్ ప్యాక్డ్ లుక్స్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

 

 

నేనే రాజు నేనే మంత్రి :  తేజ డైరెక్షన్ లో రానా హీరోగా తెరకెక్కిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది.