రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్

Tuesday,November 06,2018 - 01:41 by Z_CLU

సోషల్ మీడియాలో పండగ సీజన్ మొదలైంది. ముందే అనౌన్స్ చేసిన ప్రకారం దీపావళి  కానుకగా   రామ్ చరణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. దీంతో చాన్నాళ్ళుగా మెగా ఫ్యాన్స్ లో చక్కర్లు కొడుతున్న ‘వినయ విధేయ రామ’ టైటిల్ అఫీషియల్ గా కన్ఫమ్ అయింది.

పవర్ ప్యాక్డ్ యాక్షన్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ లుక్స్, ఫ్యాన్స్ ని జస్ట్ ఇంప్రెస్ చేయడమే కాదు, ఈ నెల 9 న రిలీజ్ కానున్న టీజర్ పై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయిన మేకర్స్, ఈ టీజర్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేయనున్నారు.

ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ ని తెరకెక్కిస్తున్న మేకర్స్, మ్యాగ్జిమం నవంబర్ లాస్ట్ వీక్ లోపు షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్నారు. ఈ లోపు నవంబర్ 9 నుండి రెగ్యులర్ గా డబ్బింగ్ పనులు చేయనున్న టీమ్, సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు.

D.V.V. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. వివేక్ ఒబెరాయ్, స్నేహ సినిమాలోని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.