‘వినయ విధేయ రామ’ ఫస్ట్ సింగిల్ రివ్యూ

Monday,December 03,2018 - 04:41 by Z_CLU

రామ్ చరణ్ కొత్త సినిమా ‘వినయ విధేయ రామ’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ థీమ్ ని ఎలివేట్ చేస్తుంది ఈ సాంగ్. దేవి శ్రీ ప్రసాద్ మార్క్  100% ఎలివేట్ అవుతుంది.

‘తందానే తందానే..’ అంటూ బిగిన్ అయ్యే ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ రాశాడు. మరీ ముఖ్యంగా ఫస్ట్ చరణంలో  ‘ఎక్కడ పుట్టిన వాళ్ళో, ఏ దిక్కున మొదలై నోళ్లో…’, ‘ఏ వాకిట పూసిన పూలో, ఒక వాకిట ఒకటై ఉన్నారుగా’ అనే లిరిక్స్, సినిమాలో రామ్ చరణ్ ఫ్యామిలీకి మరో బ్యాక్ స్టోరీ ఉంటుందనే హిట్స్ ఇస్తుంది.

ఇకపోతే ఈ లిరికల్ సాంగ్ తో పాటు రిలీజ్ చేసిన చిన్న సైజ్ విజువల్స్, రామ్ చరణ్ స్టిల్స్ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. తన మార్క్ ఏ మాత్రం మిస్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాడు బోయపాటి.

MLR కార్తికేయన్ వాయిస్ ఈ పాటకి మరింత లైఫ్ ని ఆడ్ చేస్తుందనిపిస్తుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఒబెరాయ్ తో పాటు స్నేహ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లకు తమ్ముడిలా కనిపించనున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాలో. D.V.V. దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్.