బాలకృష్ణ

Friday,November 20,2020 - 11:02 by Z_CLU

నందమూరి నటసింహం బాలకృష్ణ.. టాలీవుడ్ టాప్ హీరోల్లో బాలయ్య ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య.. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య.. తన కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. కేవలం మాస్ మాసాలా సినిమాలకే పరిమితమైపోకుండా.. సోషియో ఫాంటసీ, మైథలాజికల్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ పురాణాలకు సంబంధించి ఏదైనా సినిమా చేయాలంటే అది బాలయ్యతోనే సాధ్యం.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో కెరీర్ లో వంద సినిమాలు పూర్తిచేసిన బాలయ్య.. తన సినీప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించి అందులో నటించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Born : 10 June 1960
Zodiac : Taurus
Height : 5.6 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు