డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్ చరణ్

Saturday,June 16,2018 - 01:02 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా తెర్కక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేయబోతునట్లు ప్రకటించారు. ఇటివలే బ్యాంకాక్ లో షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నాలుగో షెడ్యూల్  షూటింగ్ జ‌రుగుతోంది.

హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారుయూనిట్.5 కోట్ల భారీవ్య‌యంతో ఈ యాక్ష‌న్పార్ట్‌ను చేస్తున్నారు. ఇందులో 60 మంది ఆర్టిస్టులు, 500 మంది బాడీ బిల్డ‌ర్స్ పాల్గొంటున్నారు.

డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో  రామ్‌చరణ్‌ సరసన  కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. స్నేహ, ప్రసన్న ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.