‘వినయ విధేయ రామ’ నుండి సెకండ్ సింగిల్

Monday,December 17,2018 - 04:31 by Z_CLU

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ నుండి సెకండ్ సింగిల్ రిలీజయింది. రీసెంట్ గా రిలీజయిన ఫస్ట్ సింగిల్ సినిమాలోని ఫ్యామిలీ ఆంగిల్ ని ఎలివేట్ చేసింది. అయితే ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అనగానే, ఫ్యాన్స్ ఈ సారి, జోష్ ఫుల్ సాంగ్ గ్యారంటీ ఎక్స్ పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టే ఉంది ఉంది ఈ ‘తస్సాదియ్యా…’ సింగిల్. DSP మార్క్ పర్ఫెక్ట్ గా ఎలివేట్ అవుతుంది.

జస్ ప్రీత్ జాజ్ వాయిస్ ఈ సాంగ్ కి సూపర్బ్ గా సెట్ అయింది. శ్రీమణి ఈ పాటకి లిరిక్స్ రాశాడు. మేకర్స్ ఈ లిరికల్ వీడియోలో, సాంగ్ మేకింగ్ ని కూడా ఆడ్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమాలో కైరా అద్వానీ, చెర్రీల కెమిస్ట్రీ అదుర్స్ అనిపించుకోవడం గ్యారంటీ అనే వైబ్స్ క్రియేట్ చేస్తుంది సాంగ్స్.

బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా.  వివేక్ ఒబెరాయ్ తో పాటు స్నేహ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లకు తమ్ముడిలా కనిపించనున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాలో. D.V.V. దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్.