బోయపాటితో పని చేస్తే ఆ కిక్కే వేరు – రామ్ చరణ్

Friday,December 28,2018 - 01:07 by Z_CLU

నిన్న గ్రాండ్ గా జరిగింది ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తో పాటు  KTR కూడా అటెండ్ అవ్వడంతో, ఈ ఈవెంట్ మరింత స్పెషల్ అనిపించుకుంది. అయితే ఈ ఈవెంట్ లో చెర్రీ,  ‘వినయ విధేయ రామ’  సినిమా  గురించి  మరీ  ముఖ్యంగా  దర్శకుడు బోయపాటి గురించి  చాలా ఎగ్జైటెడ్ గా  మాట్లాడాడు.

“బోయపాటి గారు ఎప్పుడైతే ఈ కథ నాకు చెప్పారో, ఇమ్మీడియట్ గా సినిమా బిగిన్ చేయలేదు. ఏకంగా నాలుగేళ్ళు, ఈ స్క్రిప్ట్ పై పని చేశారు. అదీ ఆయన డెడికేషన్. నేను పని చేసిన ఇన్ని సినిమాలతో కంపేర్ చేస్తే, మోస్ట్ డిసిప్లిన్డ్ అట్మాస్ఫియర్ బోయపాటి సినిమా సెట్స్ లో కనిపించింది. ప్రతి హీరో బోయపాటి గారి డైరెక్షన్ లో ఒక్కసారైనా పని చేయాలి” అని చెప్పుకున్నాడు రామ్ చరణ్.

‘సినిమాలో నేనెలా కనిపించబోతున్నాను, టోటల్ సినిమా ఎలా ఉండబోతుందన్నది నేను చెప్పడం కన్నా, సినిమాలో చూడటమే కరెక్ట్’ అని చెప్పుకున్న రామ్ చరణ్, ఈ సినిమాకి పని చేస్తున్న ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేశానని చెప్పుకున్నాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజవుతుంది వినయ విధేయ రామ. ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజర్. కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. D.V.V. దానయ్య ప్రొడ్యూసర్.