రామ్ చరణ్ సరసన అను ఎమ్మాన్యుయేల్

Tuesday,December 05,2017 - 06:25 by Z_CLU

బబ్లీ బ్యూటీ అను ఎమ్మాన్యుయేల్ మరో బిగ్ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న ఈ హీరోయిన్.. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ ఓ మూవీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రస్తుతానికి అను ఎమ్మాన్యుయేల్ సెలక్షన్ ను సీక్రెట్ గా ఉంచుతున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది చెర్రీ-బోయపాటి సినిమా.

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది అను ఎమ్మాన్యుయేల్. మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమాతో పాటు బన్నీ సరసన నా పేరు పేరు సూర్య అనే మూవీలో నటిస్తోంది. నాగచైతన్య, మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా సెలక్ట్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం అందుకుంది.