రేపట్నుంచి చెర్రీ-బోయపాటి సినిమా

Thursday,January 18,2018 - 06:10 by Z_CLU

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో రేపట్నుంచి కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఈ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. రామ్ చరణ్ మాత్రం రంగస్థలం సినిమా పూర్తిచేసి, వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వస్తాడు.

రంగస్థలం సినిమాకు సంబంధించి ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఐటెంసాంగ్. ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్నాళ్లూ పెంచిన గడ్డం తీసేసి, క్లీన్ షేవ్ తో బోయపాటి సినిమా సెట్స్ పైకి వస్తాడు రామ్ చరణ్. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాత.

రీసెంట్ గా ఈ మూవీలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. చరణ్ సరసన కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ, మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటిస్తోంది. దసరా కానుకగా చరణ్-బోయపాటి సినిమాను విడుదల చేస్తారు.