రేపటి నుండి రామ్ చరణ్ కొత్త సినిమా షెడ్యూల్

Tuesday,August 14,2018 - 12:16 by Z_CLU

2 భారీ షెడ్యూల్స్ తరవాత బ్రేక్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ రేపటి నుండి మళ్ళీ సెట్స్ పైకి రానున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగష్టు 15 నుండి హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ చేయనుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు ఫిలిమ్  మేకర్స్.

బోయపాటి మార్క్  అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందీ  సినిమా. రామ్ చరణ్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు బోయపాటి. వివేక్ ఒబెరాయ్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, స్నేహలతో పాటు రమ్యకృష్ణ  ఇంపార్టెంట్ రోల్  ప్లే చేస్తుంది.

D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కంప్లీట్ కాన్సంట్రేషన్ ఫిలిమ్ మేకింగ్ పై పెట్టిన ఫిలిం మేకర్స్ త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.