'జయజానకి నాయక' టీజర్ రిలీజయింది

Wednesday,July 12,2017 - 11:49 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ టీజర్ రిలీజయింది. బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 11 న రిలీజ్ కి రెడీ అవుతుంది. బోయపాటి మార్క్ ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సైలెంట్ గానే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇంటరెస్టింగ్ ఫస్ట్ లుక్స్ తో అటెన్షన్ ని గ్రాబ్ చేసిన సినిమా యూనిట్, ఇప్పుడీ మెలోడియస్ టీజర్ తో ఇంప్రెస్ చేసేసింది.

జగపతి బాబు కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్.