ఒక్క హిట్టు పడాలి...

Saturday,September 28,2019 - 09:02 by Z_CLU

ఒక్క హిట్టు పడాలి. ఒక్క సినిమా రికార్డులు తిరగేసే స్థాయిలో తీయాలి. ప్రస్తుతం అదే పనిలో డైరెక్టర్స్. వీళ్ళేమీ స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని స్ట్రగుల్ అవుతున్న డెబ్యూ డైరెక్టర్స్ కాదు.. ఓ టైమ్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ప్రస్తుతం కాస్త వెనకబడి ఉన్నారు. ఒక్క హిట్టు పడాలి కానీ… డవ్టే లేదు… మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తారు.

బొమ్మరిల్లు భాస్కర్ : ‘ఒంగోలు గిత్త’ తరవాత మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు.  ఆ మధ్య ఓ తమిళ సినిమా చేసినా ఈ దర్శకుడికి, తెలుగు సినిమా ఫ్యాన్స్ కి మధ్య క్రియేట్ అయిన గ్యాప్ అక్షరాలా ఏడేళ్ళు. ఈ గ్యాప్ వచ్చిందా.. లేకపోతే తనే కావాలని తీసుకున్నాడా..? అనేది అప్రస్తుతం కానీ ఈసారి మాత్రం అఖిల్ తో చేయబోయే సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఒక్క హిట్టు చాలు… మళ్ళీ వెనక్కి తగ్గేది లేదు అని కసితో ఉన్నాడు ఈ ఫ్యామిలీ సినిమాల దర్శకుడు.

 

శ్రీకాంత్ అడ్డాల : ‘బ్రహ్మోత్సవం’ తరవాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. సూపర్ స్టార్ సినిమాతో రేంజ్ మారిన ఈ దర్శకుడు ఇప్పుడు మెగా కాంపౌండ్ లో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. సినిమా అంటే జస్ట్ 2 గంటలు ఎంటర్ టైన్ అవ్వడం కాదు.. కొన్నాళ్ళ పాటు ఆ క్యారెక్టర్స్ గుర్తుండిపోవడం అని నమ్మే శ్రీకాంత్ అడ్డాల.. ఒక్క హిట్టు పడితే చాలు… అనుకోకుండా క్రియేట్ అయిన ఈ గ్యాప్ ఊసు కూడా లేకుండా పోతుంది. ఈజీగా ట్రాక్ పైకి వచ్చేస్తాడు.

శ్రీనువైట్ల : ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా తరవాత ప్రస్తుతం నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా అనుకున్న స్థాయి అంచనాలు అందుకోకపోవడంపై చిన్నగా డిజప్పాయింట్ అయినా, ఈసారి తన స్థాయి హిలేరియస్ మాస్ బ్లాక్ బస్టర్ ప్లాన్ చేస్తున్నాడు శ్రీను వైట్ల. ఈ సినిమా హిట్టయితే చాలు…

బోయపాటి : బాలయ్య బాబుతో సినిమా… రీసెంట్ సినిమా ‘వినయ విధేయ రామ’ అంచనాలను అందుకోకపోయినా ఈసారి మాత్రం ఇండస్ట్రీ హిట్ రికార్డ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు బోయపాటి. ఈ సినిమా సక్సెస్ బోయపాటి స్థాయిని మరోసారి ఎలివేట్ చేయడం గ్యారంటీ.. హిట్టు పడటం గ్యారంటీ…

వి. వినాయక్ : మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ తెరకెక్కించే లక్కీ చాన్స్ కొట్టేసినా, ఆ తరవాత వచ్చిన ‘ఇంటిలిజెంట్’ తో కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డాడు ఈ మాసివ్ డైరెక్టర్. అందుకే మెగాఫోన్ కి తనకి చిన్న గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ లోంచి కాస్త బయటికి వచ్చి ట్రాక్ లోకి రావాలి కానీ.. అంతెందుకు ‘ఒక్క హిట్టు’ ఇలా పడాలి కానీ వినాయక్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు.