బోయపాటి రిస్క్ చేస్తున్నాడా?

Monday,May 06,2019 - 03:21 by Z_CLU

లెక్కప్రకారం ఈపాటికి బాలయ్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలి. కానీ ఈక్వేషన్స్ మారిపోయాయి. దర్శకులు మారిపోయారు. బోయపాటి కంటే ముందు కేఎస్ రవికుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ఈ మూవీ తర్వాతే బోయపాటితో సినిమా. అయితే ఈ గ్యాప్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు బోయపాటి. బాలయ్యతో సినిమా కంటే ముందు ఓ చిన్న సినిమా తీయాలనుకుంటున్నాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆర్ఎక్స్100 హీరో కార్తికేయతో బోయపాటి ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి. ఆర్ఎక్స్100 తర్వాత కార్తికేయ కూడా బిజీ అయ్యాడు. హిప్పీ సినిమా చేస్తున్నాడు. నాని హీరోగా వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నాడు. మరోవైపు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో గుణ369 అనే సినిమా కూడా చేస్తున్నాడు.

ఇప్పటివరకు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే తీశాడు బోయపాటి. ఫస్ట్ టైమ్ కార్తికేయతో మీడియం రేంజ్ బడ్జెట్ లో ఓ సినిమా తీసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత బోయపాటి ఇలాంటి ప్రయత్నం చేయడం నిజంగా సాహసం.